రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

15 Feb, 2023 22:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇరిగేషన్ పాలసీ పరిశీలనలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (రేపు) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ కూడా పాల్గొనున్నారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 

సిద్దిపేట పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లను ఇద్దరు సీఎంలు సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందులోని రిజర్వాయర్లు, తెలంగాణ ఇరిగేషన్ పాలసీని పంజాబ్ సీఎంకు కేసీఆర్ వివరించనున్నారు.

మరిన్ని వార్తలు