Minister Jagadish Reddy Birthday: జగదీశ్‌రెడ్డికి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

19 Jul, 2022 00:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు మంత్రిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆశీస్సులు అందజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి తినిపించగా, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులు జగదీశ్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.  

మరిన్ని వార్తలు