రేపు మరోసారి తెలంగాణ కేబినెట్‌ భేటీ​

13 Jul, 2021 21:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వీధి దీపాల కొరకు అన్ని గ్రామాల్లో మూడో వైర్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అదే విధంగా నెల రోజులలోగా వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై చర్చించిన కేసీఆర్‌.. హైదరాబాద్‌ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య నివారణ కోసం అదనంగా రూ.1200 కోట్లు మంజూరు చేశారు.

నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు అధికారులు కేబినెట్‌కు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతికి సంబంధించిన పలు నివేదికలు కేబినెట్‌కు సమర్పించారు.

రేపు మరోసారి తెలంగాణ కేబినెట్‌ భేటీ​
రేపు(బుధవారం) మధ్యాహ్నం కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగనుంది. రేపటి సమావేశానికి మంత్రులు హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపుపై చర్చ జరగనుంది. ఇందులో భాగంగా.. పూర్తి వివరాలతో రేపటి కేబినెట్‌ సమావేశానికి హాజరుకావాలని అన్ని శాఖ కార్యదర్శులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 50వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రేపు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు