-

Jangaon Tour: ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయి: సీఎం కేసీఆర్‌

11 Feb, 2022 14:44 IST|Sakshi

సాక్షి, జనగామ: తెలంగాణలో ఎప్పుడూ కరెంట్‌ సమస్య ఉండదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉద్యోగులు చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కు బెంబేలెత్తిపోవ‌ద్దని కేసీఆర్‌ సూచించారు. ఉద్య‌మ స‌మ‌యంలో అండగా నిలిచిన ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో 10 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 7 తెలంగాణలోని గ్రామాలే అని గుర్తు చేశారు. పట్టుదలతో పనిచేస్తేనే ఇవన్నీ సాధ్యమైందన్నారు. , విద్యుత్‌శాఖ ఉద్యోగులు రాత్రిబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వేరువేరు కాదని అన్నారు.

జనగామ కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సీఎం కేసీఆర్‌ కొబ్బరికాయ కొట్టించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఒక‌ప్పుడు జ‌న‌గామ ప‌రిస్థితి చూస్తే క‌న్నీళ్లు వ‌చ్చేవి. అప్పట్లో జనగామలో మంచినీళ్లు కూడా ఉండని పరిస్థితి ఉండేది. చాలామంది పొట్టచేతపట్టుకొని వలసపోయారు. అప్పటి పరిస్థితి చూసి ఎంతో బాధపడ్డా. రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకున్నాం. అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందుతుంది.
చదవండి: ‘కేంద్ర’ ఉద్యోగాల భర్తీపై స్పష్టత: ఆర్‌.కృష్ణయ్య

భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు
తలసరి ఆదాయం త్వరలో రూ.2.70లక్షలకు పెరగబోతుంది. హైదరాబాద్‌లో 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. ఢిల్లీ ముంబై నుంచి వచ్చి హైదరాబాద్‌లో కొంటున్నారు. జోనల్‌ వ్యవస్థతో అందరికీ న్యాయం. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారు.’అని తెలిపారు. అనంతరం సమీపంలోని మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. జ‌న‌గామ‌లో భూముల విలువ‌లు పెరిగాయి. ఏడేళ్ల కింద రూ. రెండు ల‌క్ష‌ల విలువ‌న్న ఎక‌ర భూమి.. ఇప్పుడు రూ.3,3 కోట్లకు చేరింది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక‌ర పొలం రూ. 25 ల‌క్ష‌ల‌కు త‌క్కువ పోత‌లేదు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సాధ్య‌మైంది. సీఎస్, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు