హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి అభినందన

16 Nov, 2022 01:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని ఆశీర్వదించారు. ఈ మేరకు డాక్టర్‌ శ్రీనివాసరావు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

కొత్తగూడెంలో మెడికల్‌ కాలేజీ ప్రారంభించడంపై సీఎంకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ... సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువస్తూ ఒకేసారి రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ జాతిపితగా సుపరిపాలనతో చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తలు