ప్రధాని అపాయింట్‌మెంట్‌ కేసీఆర్‌ అడగలేదు

26 Nov, 2021 03:02 IST|Sakshi

సీఎంఓ నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదు

కేంద్ర ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలే దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే గత సెప్టెంబర్‌ 1వ తేదీన అపా యింట్‌మెంట్‌ కోసం విజ్ఞప్తి వచ్చిందని, దాంతో అదే నెల 3వ తేదీన అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, సీఎం కేసీఆర్‌ వారిని కలవడం జరిగిం దని గుర్తు చేశాయి. నీటి పంపకాలు, వరి ధాన్యం కొను గోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవ డానికి ఢిల్లీ వెళ్తామని, అవసరమైతే తాను ప్రధానిని కలు స్తానని గత శనివారం సీఎం విలేకరుల సమా వేశంలో చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా ఆ మరు సటి రోజే ఢిల్లీ బయ ల్దేరి వెళ్లిన సీఎం బుధవా రం సాయంత్రం హైదరా బాద్‌ తిరిగి చేరు కున్నారు. అయితే నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌.. మోదీని, అమిత్‌ షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇచ్చా యి. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరుతూ తమకు ఎలాంటి వర్తమానం అందలేదని తెలిపాయి. 

మరిన్ని వార్తలు