వరంగల్, హైదరాబాద్‌లో ‘తెలంగాణ భవన్‌’లు

8 Feb, 2022 01:22 IST|Sakshi
జనగామలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం 

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల కోసం స్థలాన్వేషణ

ఇప్పటికే సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభం

11న జనగామ తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్న సీఎం

దేశ రాజధాని నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం

సాక్షి, హైదరాబాద్‌: అన్ని జిల్లా కేంద్రాల్లో ‘తెలంగాణ భవన్‌’పేరిట పార్టీ జిల్లా కార్యాలయా లను నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ హైదరాబాద్, వరంగల్‌ జిల్లా కేంద్రాల్లోనూ కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరా బాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ఉండగా, గతంలో కరీంనగర్‌లో ఉత్తర తెలంగాణ భవన్‌ను నిర్మించారు. వరంగల్‌లోనూ టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని గతంలోనే నిర్మించినా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రస్తుతమున్న కార్యాలయం హనుమకొండ జిల్లా పరిధిలోకి వెళ్లింది.

దీంతో వరంగల్‌ జిల్లా కేంద్రంగా మరో కార్యాలయం తెలంగాణ భవన్‌ను నిర్మించనున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యాలయం ఉన్నా జిల్లా అవసరాల కోసం మరో చోట కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వరంగల్, హైదరాబాద్‌ జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌ల నిర్మాణం కోసం అనువైన స్థలం కోసం పార్టీ నేతలు అన్వేషిస్తున్నారు. 33 జిల్లాలకు పార్టీ కొత్త అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో వరం గల్, హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌ల నిర్మాణా నికి అనువైన స్థలం అన్వేషించాల్సిందిగా ఆయా జిల్లాల అధ్యక్షులను అధినేత ఆదేశించారు.

అను వైన స్థలం దొరికితే ఈ ఏడాది అక్టోబర్‌లోగా పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడిం చాయి. ఇదిలా ఉంటే, గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో టీఆర్‌ఎస్‌ కార్యాలయం ‘తెలంగాణ భవన్‌’కు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా నాటికి నిర్మాణం పూర్తయ్యేలా శరవేగంగా పనులు సాగుతున్నాయి.

మరో 29 జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లు
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ మినహా మిగతా జిల్లా కేంద్రాల్లో 2019, జూన్‌ 24న పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి ఏకకాలంలో పార్టీ నేతల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ ఖాతా నుంచి నిధులు అంద జేయగా, అదే ఏడాది జూలైలో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రాష్ట్ర కేబినెట్‌ భూ కేటాయింపులు జరిపింది. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయాన్ని 2020, డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

కరోనా, వర్షాలు, వివిధ ఎన్నికల మూలంగా ఇతర చోట్ల టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్స వం వాయిదా పడుతూ వస్తోంది. వీటి ప్రారంభం తర్వాత కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహి స్తామని కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. ఇటీవల జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన కేసీఆర్‌ వీలైనంత త్వరగా జిల్లా కార్యాలయాలను ప్రారంభించాలని భావిస్తున్నారు.

పార్టీ కార్యాలయానికి అనుబం ధంగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేం దుకు వీలుగా షెడ్లతో పాటు పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధినేత గతంలోనే ఆదేశించారు. కాగా, ఈ నెల 11న జనగామ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు