సీఎం కేసీఆర్‌ తాజా రిపోర్ట్‌లో మిశ్రమ ఫలితాలు

29 Apr, 2021 21:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరోనా నుంచి కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ప్రకటించారు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌కు తాజాగా గురువారం యాంటిజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. వాటిల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నిన్నటి యాంటిజెన్ టెస్ట్ నివేదికలో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదికలో కచ్చితమైన ఫలితం రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు.

వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని వైద్యుడు ఎంవీ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రెండు, మూడు రోజుల్లో మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ఏప్రిల్‌ 19వ తేదీన కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకున్నారు.

చదవండి: నాగార్జున సాగర్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌దే
చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..

మరిన్ని వార్తలు