నష్టంపై నేడు సీఎం సమీక్ష!

18 May, 2022 01:59 IST|Sakshi

పల్లె, పట్టణ ప్రగతిపై కలెక్టర్లతో నేడు ఉన్నత స్థాయి సమావేశం 

వర్షాలతో జరిగిన నష్టంపై నివేదికతో రావాలని ఆదేశం

బాధిత రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకునే అవకాశం

ఇక ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఆదేశించనున్న సీఎం

ప్రకృతి వనాలు, మార్కెట్ల పురోగతిపైనా చర్చ

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలతో అన్న దాతలకు జరిగిన నష్టం పై సీఎం కేసీఆర్‌ నేడు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోను న్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై బుధవారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. అకాల వర్షాలతో రైతులకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలతో రావాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.

ఆదివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో వాన విరుచుకు పడ టంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోవడం, కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. వానలతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలా బాద్, మెదక్‌ జిల్లాల రైతులు నష్ట పోయారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగిన జాప్యం వల్లే నష్టపోవాల్సి వచ్చిందని అన్న దాతలు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో పురోగతితో పాటు వర్షాలతో జరిగిన నష్టంపై కలెక్టర్లతో సీఎం చర్చించి రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

..క్రీడాప్రాంగణం పేరుతో..
తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం పేరిట రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. వీటి ఏర్పాటు కోసం స్థలా లను సేకరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభు త్వం ఆదేశించింది. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు ఇప్పటికే చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సమీకృత శాకాహార/ మాంసాహార మార్కెట్ల నిర్మాణంలో పురోగతి, జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో కేసీఆర్‌ చర్చించనున్నారు.

తదుపరి విడత పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టా ల్సిన చర్యలు, సాధించాల్సిన పురోగతిపై లక్ష్యాలను నిర్దేశించే అవకాశం ఉంది. పురోగ తిని సమీక్షించేందుకు జిల్లాల పర్యటనలను నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. లక్ష్యా ల సాధనలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న సందేశాన్ని మంత్రులు, అధికారు లకు తెలియజేయనున్నారు. జెడ్పీ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, మేయర్లు, కమిషనర్లను సమావేశానికి ఆహ్వానించారు.   

మరిన్ని వార్తలు