రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదలతో సీఎం అడుగులపై సర్వత్రా ఆసక్తి

10 Jun, 2022 02:06 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వంతోపాటు బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్‌ 

ఇప్పటికే బీజేపీయేతర పార్టీల సీఎంలు, కీలక నేతలతో చర్చలు 

జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే దిశగా ప్రయత్నాలు 

ప్రత్యామ్నాయ ఎజెండా, రాష్ట్రపతి ఉమ్మడి అభ్యరి్థపైనే మంతనాలు!

అభ్యర్థి ఎంపిక కోసం త్వరలో హైదరాబాద్‌ లేదా ఢిల్లీలో భేటీ! 

గురువారం ఫామ్‌హౌస్‌లో ముఖ్యమంత్రితో సమావేశమైన పీకే 

విపక్షాలను ఏకతాటిపైకి తేవడం, అభ్యర్థి గెలుపు అవకాశాలపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో.. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల దిశగా పయనిస్తున్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వేసే అడుగులపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌ ఏ విధంగా ముందుకు వెళతారు? బీజేపీతో తలపడేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారు? అనే చర్చ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతున్న సీఎం..కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీయేతర ముఖ్యమంత్రులు, విపక్ష పారీ్టల కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలో గత వైఖరికి పూర్తిగా భిన్నమైన పంథాను అనుసరించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. పోయినసారి జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదిత అభ్యరి్థకి ఆయన మద్దతు పలికిన సంగతి విదితమే. కాగా తాజా ఎన్నిక ప్రక్రియ రాజకీయంగా మరింత వేడి రగిలించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఉమ్మడి అభ్యరి్థపైనే చర్చలు! 
    మూడు నెలల్లో దేశ రాజకీయాల్లో సంచలనం చూస్తారని గత నెల చివరి వారంలో జరిగిన బెంగళూరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తుండగా, తాజాగా ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేయాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. బీజేపీయేతర పారీ్టలకు చెందిన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్, నవీన్‌ పటా్నయక్‌లతో ఆయన గతంలో భేటీ అయ్యారు.

ఇటీవలి కాలంలో సీఎంలు ఉద్దవ్‌ ఠాక్రే, స్టాలిన్, హేమంత్‌ సొరేన్, అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌తోనూ వివిధ సందర్బాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలకు నేతలుగా ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎంలు శరద్‌ పవార్, కుమారస్వామి, అఖిలేశ్‌ యాదవ్, బిహార్‌ విపక్ష నేత తేజస్వి యాదవ్‌తో కూడా సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ ఎజెండాతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలపడమే లక్ష్యంగా ఈ భేటీల్లో చర్చించినట్లు సమాచారం. 

త్వరలో ప్రత్యేక సమావేశం 
    పశి్చమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, సామాజిక కార్యకర్త అన్నా హజారేతోనూ గత నెల చివరి వారంలో కేసీఆర్‌ భేటీ కావాల్సిన ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో కేసీఆర్‌ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలో మరోమారు బీజేపీయేతర సీఎంలు, ఇతర కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్‌ లేదా ఢిల్లీ వేదికగా త్వరలో ఈ భేటీ ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

కేసీఆర్‌తో పీకే భేటీ.. 
    రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రాజకీయ వ్యవహారాలను మదింపు చేస్తూ పీకే బృందం నివేదికలు ఇస్తున్న విషయం తెలిసిందే. జాతీయస్థాయి రాజకీయాలతోనూ విస్తృత సంబంధాలు ఉన్న పీకే కొంతకాలంగా వివిధ పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకు రావడం, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపకల్పనలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన భేటీలో.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థ, గెలుపు అవకాశాలు, జాతీయ స్థాయిలో పార్టీల నడుమ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన, విపక్ష ఓట్లు చీలకుండా అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్లు తెలిసింది.    

మరిన్ని వార్తలు