సొంతింటికి వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్‌ 

13 Jul, 2021 01:04 IST|Sakshi
నంది నగర్‌లోని తన నివాసానికి చేరుకుంటున్న సీఎం కేసీఆర్‌

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి శోభతో కలిసి సోమవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14 నందినగర్‌లోని తన సొంత ఇంటికి వచ్చారు. కొంత కాలంగా ఈ ఇంటిలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించేందుకు వచ్చారు. పావుగంట పాటు సీఎం కేసీఆర్‌ పనులను చూసి పలుచోట్ల మార్పులు, చేర్పులు సూచించారు. ఇదిలా ఉండగా ఆయన మనవడు హిమాన్షు ఉదయం ఈ ఇంటికి వచ్చి గంటపాటు ఉండి వెళ్లారు.

మరిన్ని వార్తలు