కొత్తగా 623  కరోనా కేసులు 

30 Jul, 2021 03:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 623 మందికి కోవిడ్‌–19 నిర్ధారణైంది. ఇప్పటివరకు 6,43,716 మంది కరోనా వైరస్‌ బారినపడగా, వీరిలో 6,30,732 మంది కోలుకున్నారు. మరో 9,188 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌–19తో మరో ముగ్గురు మరణించగా, ఇప్పటివరకు 3,796 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 1,11,947 పరీక్షలు చేశారు. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 1,06,462, ప్రైవేటు కేంద్రాల్లో 5,485 పరీక్షలు చేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కోవిడ్‌–19 రిస్క్‌ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 97.98 శాతంగా ఉన్నట్లు వివరించింది. 

మరిన్ని వార్తలు