పాఠశాలల్లో కరోనా కలకలం 

9 Sep, 2021 01:24 IST|Sakshi
కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది 

సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, జనగామ జిల్లాల్లోని పాఠశాలల్లో 9 కేసులు 

తుంగతుర్తి/దేవరకొండ/కట్టంగూర్‌/నాగర్‌కర్నూల్‌ క్రైం/లింగాలఘణపురం: రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా సూర్యాపేట, నల్లగొం డ, నాగర్‌కర్నూల్, జనగామ జిల్లాల్లోని పాఠశాలల్లో తొమ్మి ది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం జెడ్పీ ఉన్న త పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి బుధవా రం కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కమలాపూర్‌ ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలంలోని దుగినవెల్లి ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు.  

నాగర్‌కర్నూల్‌లో నలుగురు విద్యార్థినులకు..
తరగతులు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలికల)లో చేసిన పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా తేలింది.

మిగతా విద్యార్థులకు గురువారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన వారికి మెడికల్‌ కిట్లు అందించి, పాఠశాలలను శానిటైజ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు