భద్రాచలం కిమ్స్‌లో అగ్నిప్రమాదం..

3 Oct, 2022 19:27 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కిమ్స్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం రాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. అయితే, సకా లంలో అగ్నిమాపక సిబ్బంది, ఆస్పత్రి నిర్వాహకులు స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది.

ఆస్పత్రి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని స్కానింగ్‌ గదిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడగా దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో నిర్వా హకులు అగ్నిమాపక సిబ్బందికి సమా చారం ఇవ్వగా వారు చేరుకుని ఆక్సిజన్‌ మాస్క్‌లతో లోపలికి వెళ్లి ఐసీయూలో ఉన్న ముగ్గురు, చికిత్స పొందుతున్న మరో పది మందిని బయటకు తీసు కొ చ్చారు. ఐసీయూలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు.  మంటలు రాకపోవడంతో ముప్పు తప్పింది.  

మరిన్ని వార్తలు