Black Fungus: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

20 May, 2021 11:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి పాలిట బ్లాక్‌ ఫంగస్‌ శాపంగా మారుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ఫంగస్‌ను ఎపిడమిక్‌ యాక్ట్ 1897లో చేర్చింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం బ్లాక్‌ ఫంగస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ఫంగస్‌ (మ్యూకోర్‌మైకోసి)ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించిన బాధితుల సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ప్రతిరోజు రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.

ఇక దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కాగా మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)ను రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే అంటువ్యాధిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
(చదవండి: Koti ENT Hospital: బ్లాక్‌ ఫంగస్‌కు మెరుగైన చికిత్స)

మరిన్ని వార్తలు