Telangana: మహేందర్ రెడ్డి పదవీ విరమణ.. నూతన డీజీపీగా అంజనీకుమార్‌

31 Dec, 2022 10:14 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. మహేందర్ రెడ్డి 36 ఏళ్లపాటు ఐపీఎస్‌గా సేవలందించారు.  మహేందర్ రెడ్డి స్థానంలో తెలంగాణ కొత్త డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

మహేందర్ రెడ్డితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు అంజనీకుమార్ చెప్పారు. ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారని, ఎన్నో రకాలుగా మహేందర్ రెడ్డి తనకు ఆదర్శమన్నారు. ఆయన హయాంలో టెక్నాలజీ వ్యవస్థ అభివృద్ధి చెందిందని కొనియాడారు. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలని సూచించారు. క్విక్ రెస్పాన్స్  సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటామన్నారు.

ప్రభుత్వం పోలీస్ శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది.కేసీఆర్ ముందు చూపు వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దేశానికే ఆదర్శం. ప్రతి పౌరుడిని పోలీస్ అని చెప్పిన మహేందర్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తాం. అని అంజనీకుమార్ పేర్కొన్నారు.
చదవండి: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు