తెలంగాణ: డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌

20 May, 2022 18:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. అభ్యర్థుల ఎత్తును 167 సెం.మీ నుంచి 165 సెం.మీకు తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది.

గ్రూప్‌ 1 ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. డీఎస్పీ అభ్యర్థుల ఎత్తు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ డిమాండ్‌కు తలొగ్గి.. ఇప్పుడు ఎత్తు తగ్గించి నిరుద్యోగులకు ఊరట ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

చదవండి👉తెలంగాణ పోలీస్‌ నియామక అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్‌

మరిన్ని వార్తలు