ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ

23 Jun, 2022 13:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్, నీట్, జేఈఈకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీ–శాట్‌ ద్వారా ఉచిత శిక్షణ కొనసాగుతుందని ఇంటర్‌ బోర్డ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్‌ సమయంలో 2020లో ప్రారంభించిన ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని, ఇప్పటికే 12 వేల మంది నమోదు చేసుకు న్నారని బోర్డ్‌ స్పష్టం చేసింది. జాతీయ పోటీ పరీక్షలపై సమగ్ర శిక్షణ ఇవ్వడమే కాకుండా, మోడల్‌ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టీ–శాట్‌ ద్వారా సాయంత్రం 6.30 గం టల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదు పాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. 

ఇంజనీరింగ్‌ పీజీసెట్‌– 2022 గడువు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఇంజనీరింగ్‌ పీజీసెట్‌ (టీఎస్‌ పీజీఈసీఈటీ– 2022) దరఖాస్తులకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు గడువు పొడిగించి నట్లు కన్వీనర్‌ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. చివరి సంవత్సరం పరీక్షలు రాసే బీఈ, బీటెక్‌ విద్యార్థులు, వివిధ రకాల సెమిస్టర్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే ఇంజనీరింగ్‌ విద్యార్థులు కూడా పీజీఈసెట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

15లోగా విద్యార్థులందరికీ యూనిఫాం 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జూలై 15లోగా యూనిఫాం అందజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్‌ను రూపొందించి జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యా యులకు పంపింది. మొత్తం 33 జిల్లాల్లో 22,78,569 మంది విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరికి 67,75,522 మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేసి, ఈమేరకు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి దశలో 24,69,214 మంది విద్యార్థులకు జూలై 4వ తేదీలోగా యూనిఫాం అందించాలని, మిగతా విద్యార్థులకు జూలై 15లోగా ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. కొత్తగా ప్రవేశం పొందే వారికి కూడా యూని ఫాం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ ప్రక్రియ జూలై నెలాఖరుకల్లా పూర్తయ్యే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (క్లిక్‌: గురుకులాల్లో మరో 1,000 కొలువులు!)

మరిన్ని వార్తలు