పాడి, పౌల్ట్రీ రంగాలకు విద్యుత్‌ సబ్సిడీ

11 Aug, 2021 04:22 IST|Sakshi

ప్రతి యూనిట్‌పై రూ.2 తగ్గింపు

సాక్షి, హైదరాబాద్‌: పాడి, పౌల్ట్రీ రంగాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీ ప్రకటించింది. విజయ డెయిరీ విద్యుత్‌ చార్జీలపై యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వనుంది. ఈ మేరకు పాడి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని డెయిరీ ఫారమ్‌లు, డెయిరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు, లేయర్‌ ఫారమ్‌లు, బ్రాయిలర్‌ ఫారమ్‌లు, హ్యాచరీస్, ఫీడ్‌ మిల్స్, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఒక్కో యూనిట్‌ విద్యుత్‌పై రూ.2 చొప్పున సబ్సిడీ పొందడానికి అర్హులను తెలిపింది. అర్హులైన డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు https://elaabh telangana gov.in వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలని సూచించింది.

మరిన్ని వార్తలు