నిధులివ్వకున్నా... అవార్డులిస్తున్నారు: ఎర్రబెల్లి 

25 Apr, 2022 03:14 IST|Sakshi
అవార్డు గ్రహీతలను అభినందిస్తున్న కేటీఆర్, ఎర్రబెల్లి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి నిధులు ఇవ్వకున్నా... అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గతంలో కేంద్రం నుంచి మన రాష్ట్రానికి నెలకు రూ. 300 కోట్లు వచ్చేవని, కానీ ఇప్పుడు 237 కోట్లు మాత్రమే ఇస్తున్నదని తెలిపారు. ఇటీవల 19 జాతీ య అవార్డులు దక్కించుకున్న సిరిసిల్ల జెడ్పీ చైర్మన్, నలు గురు ఎంపీపీ చైర్మన్లు, 11మంది సర్పంచ్‌లను పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన సన్మానించారు.

అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రా మాలన్నింటినీ ఆదర్శంగా రూపుదిద్దాలనే సదాశయంతో చేపట్టిన ‘పల్లెప్రగతి’వల్లే ఇన్ని అవార్డులు వస్తున్నాయన్నా రు. మే 20 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే ‘పల్లె ప్రగ తి’, పట్టణ ప్రగతిని కార్యక్రమాలను విజయవం తంగా నిర్వహించాలని ఆదేశించారు. ‘2001 నుంచి 2014ల మ ధ్య, తెలంగాణ రాకముందు ఒకే ఒక అవార్డు దక్కింది.

కానీ, తెలంగాణ ఆవిర్భావం తరువాత అనేక అవార్డులొచ్చా యి. ఈ ఒక్క ఏడాదే 19 అవార్డులు వచ్చాయంటే తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’అని ఎర్రబెల్లి అన్నారు. అవార్డులు వచ్చిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీలు, జెడ్పీలు ఆ స్థాయిని నిలుపుకోవాలని సూచించారు. అనంతరం ఆయన అవార్డులు పొందిన వారితో కలిసి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్‌ వారిని సన్మానించి, అభినందించారు. 

మరిన్ని వార్తలు