తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల అల్టిమేటం

21 Jul, 2021 13:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఏలు మాట్లాడుతూ.. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తొలగించిన 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేకుంటే హుజురాబాద్‌లో వేయి మంది పోటీ చేస్తామని హెచ్చరించారు.

కాగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విధానాల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని ఫీల్డ్ అసిస్టెంట్లు అవేదన వ్యక్తం చేశారు. ఇందుకు వ్యతిరేకంగా మార్చి 12న సమ్మె బాట పట్టారు.  సమస్యలను పరిష్కరించాలని, గ్రేడింగ్‌ నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమించారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అదే నెల 25న సమ్మెకు దిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు