మత్స్యకారుల హక్కులకు భంగం కలగనీయం

12 Sep, 2021 01:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మత్స్యకారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన మత్స్యకారుల సమన్వ య కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సమన్వయ కమిటీ సభ్యులు కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో పర్యటించి అక్కడ గుర్తించిన సమస్యలపై సమావేశంలో వివరించారు.

నిబంధనలకు అనుగుణం గా ఉన్న సమస్యల పరిష్కారానికి వెం టనే చొరవ చూపాలని మంత్రి శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యాను ఆదే శించారు.  మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నీటి వనరులను కూడా మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు