తెలంగాణ అవతరణ దినోత్సవం.. ఎనిమిదేళ్ల అసంతృప్తి

2 Jun, 2022 19:03 IST|Sakshi
రఘునాథ చెరువుపై పూర్తికాని మినీట్యాంక్‌ బండ్‌ పనులు

అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఊసేలేదు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు టూరిజం ఏమైందో..

నగరంలో పులాంగ్‌ వాగు కబ్జా

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు ఎప్పటికీ  పూర్తయ్యేనో..

సబ్బండ వర్ణాల పోరాటం, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎనిమిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి మొదటిసారి జిల్లా ప్రజాపరిషత్‌ విజయాన్ని అందించి నిజామాబాద్‌ జిల్లా ఊపిరిలూదింది. ఇలాంటి జిల్లా వ్యవసాయంలో అగ్రభాగంలో ఉండి తలమానికంగా నిలుస్తోండగా.. అనుబంధ పరిశ్రమలు, యూనిట్ల ఏర్పాటు ముందుకు కదలడం లేదు. ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించే అవకాశాలున్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కనిపించడం లేదు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, నిజామాబాద్‌: ప్రసిద్ధి గాంచిన బోధన్‌లోని నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీ జిల్లాలో ఎకానమీకి గతంలో మంచి ఊతం ఇస్తూ వచ్చింది. అయితే 2015లో ఫ్యాక్టరీ మూతపడింది. దీన్ని ఇప్పటి వరకు తెరిపించడం లేదు. దీంతో గతంలో 60వేల ఎకరాల్లో చెరుకు సాగు చేసిన రైతులు అనివార్యంగా వరి పంట వేయాల్సి వస్తోంది. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ఫ్యాక్టరీని తెరిపించాలని అన్నివర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పాటు సారంగాపూర్‌ సహకార చక్కెర ఫ్యాక్టరీని సైతం తెరవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇథనాల్‌కు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో వాటిని తెరిపిస్తే మేలంటున్నారు.

ఉమ్మెడ వంతెనకు అప్రోచ్‌ రోడ్‌ ఎప్పుడో..
నిర్మలౖ–నిజామాబాద్‌ జిల్లాలను కలిపే మహారాష్ట్ర వెళ్లే రహదారిపై నందిపేట మండలం ఉమ్మెడ–పంచగుడ మధ్య గోదావరిపై వంతెన నిర్మించారు. అయితే వంతెనకు అటువైపు డబులై రోడ్డు పూర్తయి ఏళ్లు గడుస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఇటువైపు నందిపేట మండలంలో వంతెన పైకి వెళ్లే అప్రోచ్‌∙రోడ్డు పనులు నిలిపోయాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కొద్దిమేర రోడ్డు పూర్తయితే లక్కంపల్లి సైతం మరింత ఊతం లభిస్తుంది. రాకపోకలు పెరిగి ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెరిగే అవకాశాలున్నాయి.  శ్రీరాంసాగర్‌ జలాశయం పునరుజ్జీవం అటకెక్కింది. గతంలో 120 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయం ప్రస్తుతం 80 టీఎంసీల లోపునకు పడిపోయింది. మరోవైపు శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి నందిపేట మండలంలోని గ్రామాల వద్ద కాటేజీలు నిర్మించడంతో పాటు, బాసర వరకు బోటింగ్‌ సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి.

అంచనాలు పెంచడమేనా..
నిజామాబాద్‌ నగరం విషయానికి వస్తే ఇక్కడ రూ. వందల కోట్ల పనులు సా..గుతూనే ఉన్నాయి. రూ.240 కోట్ల విలువైన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు ఏళ్లతరబడి నత్తనడకను తలపిస్తున్నాయి. రూ.4 కోట్ల నుంచి రూ.22 కోట్లకు అంచనాలు పెంచుతూ వచ్చిన బొడ్డెమ్మ చెరువు పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. హైదరాబాద్‌ రోడ్డులో కీలకమైన మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. జక్రాఉ పల్లి వద్ద విమానాశ్రయం కోసం కేంద్రం నుంచి అనుమతులు వచ్చినపటికీ దాని ఊసే లేదు. ఇదిలా ఉండగా నగరంలో వరద నీరు వెళ్లేందుకు సహజసిద్ధంగా ఏర్పడిన పులాంగ్‌ వాగును అధికార పార్టీ నేతలే అనేక చోట్ల కబ్జాలు చేయడంతో అది కాస్తా పిల్లకాలు వలాగా మారిపోయింది. దీంతో నగరం భవిష్యత్తులో వరద ముంపునకు మరింత గురయ్యే అవకాశాలున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లెదర్‌ పార్క్‌ భవనంతో సరి..
ఆర్మూర్‌ యానంగుట్ట వద్ద లెదర్‌ పార్క్‌ కోసం గతంలో జిల్లా నుంచి మండవ వెంకటేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలో 24 ఎకరాలు కేటాయిం^éరు. భవనం కట్టి వదిలేశారు. మరోవైపు వేల్పూరు మండలం పడగల్‌ వద్ద స్పైసెస్‌ పార్క్‌ కోసం సేకరింన 70 ఎకరాల భూమిలో ప్రహరీ కట్టి వదిలేశారు. ఆ తరువాత ఇది అటకెక్కింది. ధర్పల్లిలో 2008లో పసుపు పరిశోధన కేంద్రం పేరిట కట్టిన భవనం అలాగే వదిలేశారు. ఇక భీమ్‌ గల్‌లో గతంలో ఉన్న బస్‌ డిపో ఎత్తేశారు.

● క్కంపల్లి సెజ్‌లో..
నందిపేట మండలం లక్కంపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో 378 ఎకరాల్లో సెజ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక పరిశ్రమ లకు అవకాశాలున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగలేదు. కనీసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సైతం అవకాశాలు రాలేదు. దీంతోయువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదు.

మరిన్ని వార్తలు