తాడిచర్ల గనికి ‘భద్రత’ పురస్కారం

27 Oct, 2022 01:48 IST|Sakshi
తాడిచర్ల గనికి వచ్చిన పురస్కారాన్ని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకి అందజేస్తున్న  సంస్థ డైరెక్టర్‌ టీఆర్‌కేఆర్‌ రావు 

సాక్షి, హైదరాబాద్‌: గనుల భద్రత విషయంలో ఉత్తమ విధానాలను అవలంభిస్తున్నందుకు తెలంగాణ జెన్‌కోకు చెందిన తాడిచర్ల–1 బొగ్గు గనికి డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ విభాగం పురస్కారాన్ని అందజేసింది. వార్షిక భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ పురస్కారాన్ని తాడిచర్లలో అందుకున్నట్లు జెన్‌కో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు