ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు

17 Jun, 2022 02:32 IST|Sakshi

5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌ అమలు ద్వారా రూ.4.1 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి మూలంగా గడిచిన ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించింది. ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్, బిల్‌మార్ట్‌ ఫిన్‌టెక్‌ సంస్థల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయన వివరాలను ఎంఎస్‌ఎంఈ ఈపీసీ చైర్మన్‌ డీఎస్‌ రావత్, బిల్‌మార్ట్‌ ఫిన్‌టెక్‌ సీఈఓ వ్యవస్థాపకుడు జిగేశ్‌ సొనగరా గురువారం విడుదల చేశారు.

10 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే 38 వేర్వేరు ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు ఇవ్వడం.. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణను ప్రత్యేక స్థానంలో నిలబెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ సులభతర వాణిజ్య విధానానికి దోహదం చేసిందని వివరించారు. గతంలో వచ్చిన పెట్టుబడుల కంటే టీఎస్‌ ఐపాస్‌ అమలు ద్వారా గడిచిన ఏడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులే ఎక్కువని ఈ అధ్యయనం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు