New Covid Variant BF7: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌

22 Dec, 2022 12:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే, బుధవారం రోజున తెలంగాణలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పాజిటివ్‌ శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. 

చదవండి: (Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు)

మరిన్ని వార్తలు