మావోయిస్టులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

24 Apr, 2021 04:28 IST|Sakshi

మావోయిస్టు పార్టీపై ఏడాది నిషేధం

విరసంపై కూడా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసం సహా 16 అనుబంధ సంఘాలపైనా వేటు వేసింది. పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ 1992 ప్రకారం వీటిపై మరో ఏడాదిపాటు నిషేధం కొనసాగుతుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి 30న నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది.

అనుంబంధ సంఘాలివే.. 
తెలంగాణ ప్రజాఫ్రంట్‌ (టీపీఎఫ్‌), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్‌), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్‌), ఆదివాసీ స్టూడెంట్‌ యూనియన్‌ (ఏఎస్‌యూ), కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ (సీఆర్‌పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్‌ఎస్‌), తుడుందెబ్బ (టీడీ), ప్రజాకళామండలి (పీకేఎం), తెలంగాణ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (టీడీఎఫ్‌), ఫోరం అగైనెస్ట్‌ హిందూ ఫాసిజం అఫెన్సివ్‌ (ఎఫ్‌ఏహెచ్‌ఎఫ్‌వో), సివిల్‌ లి బర్టీస్‌ కమిటీ (సీఎల్‌సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్‌), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌), విప్లవ రచయితల సంఘం (విరసం).. ఈ 16 సంస్థలు ప్రజాసంఘాల ముసుగులో ప్రజల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.

చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ..
చదవండి: తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్‌

మరిన్ని వార్తలు