ఇచ్చట సుందరీకరణ మూణ్నాళ్ల ముచ్చట..

17 Jul, 2021 07:27 IST|Sakshi

సాక్షి, ఉప్పల్‌: మూసీ సుందరీకరణ మట్టికొట్టుకుపోయింది. ప్రారంభానికి ముందే పనులు ఆనవాళ్లు కోల్పోయాయి. అధికారుల ముందుచూపు లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయలు నీళ్లపాలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందుకు రూ.5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు ఉప్పల్‌ సమీపంలోని మూసీ తీరాన ఐదు కిలోమీటర్ల మేర వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం చేపట్టారు. అందమైన పార్కులు తీర్చిదిద్దారు.

కానీ వీటి నిర్వహణ విషయంలో ముందుచూపు ఆలోచన చేయలేదు. వరదలు వస్తే ఇవి ఉంటాయా..లేదా అన్నది పరిగణనలోకి తీసుకోలేదు. అధికారుల పర్యవేక్షణ సరిగాలేక కాంట్రాక్టర్లూ నాసిరకం పనులు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలకు సుందరమైన పార్కు, మొక్కలు, వాకింగ్‌ ట్రాక్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి.  

మరిన్ని వార్తలు