జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..విధుల్లోకి జూడాలు

28 May, 2021 07:56 IST|Sakshi

ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ..

సాక్షి, హైదరాబాద్‌/గాంధీ ఆస్పత్రి: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా అత్యవసర, సాధారణ విధులను బహిష్కరించిన జూని యర్‌ డాక్టర్లు సమ్మె విరమించి గురువారం రాత్రి నుంచి విధుల్లో చేరారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో ఈనెల 26 నుంచి అత్యవసర, ఐసీయూ సేవలు మినహా విధులు బహిష్కరిం చిన సంగతి తెలిసిందే.

స్టైపెండ్‌ పెంపు, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో చికిత్స, పదిశాతం ప్రోత్సాహ కం, విధినిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అనే నాలుగు డిమాం డ్లపై ఈనెల 10న సమ్మె నోటీసులు ఇవ్వగా... సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు సైతం సమ్మె నోటీసు ఇచ్చి బుధవారం నుంచి విధులు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనలతో రంగంలోకి దిగిన వైద్య విద్య సంచాలకులు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపినప్పటికీ లిఖితపూర్వక హామీ రాకపోవడంతో గురువారం కూడా సమ్మె కొనసాగించారు. 

రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కారం
కోవిడ్‌–19 అత్యవసర పరిస్థితుల్లో విధులు బహిష్కరించడం సరికాదనే కోణంలో జూని యర్‌ డాక్టర్ల సంఘం, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల సంఘాలతో బీఆర్‌కే భవన్‌లో వైద్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ప్రత్యేకంగా చర్చ లు జరిపారు. ఇంటర్న్‌షిప్‌ డాక్టర్లతో పాటు జూనియర్‌ డాక్టర్ల స్టైపెండ్‌ 15% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. అదేవిధంగా సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు కూడా స్టైఫండ్‌ 15 శాతం పెంచుతున్నట్లు అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు.

వీటితో పాటు కరోనా బారిన పడితే జూనియర్‌ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్సకు సైతం ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా విధినిర్వహణలో మరణించిన హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ కుటుంబసభ్యులకు పరిహారం ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కరించగా... మిగతావాటిపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు స్పష్టత రావడంతో జూనియర్‌ డాక్టర్లు, సీనియర్‌ రెసిడెంట్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరనప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వాసరి నవీన్, హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు మణికిరణ్‌రెడ్డి, సునయ్‌లు చెప్పారు. త్వరలో మిగతా డిమాండ్లు సైతం పరిష్కారమవుతాయని జూడాల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. కోవిడ్‌–19 అత్యవసర సమయంలో రోగులకు వైద్య సేవలు అందించాలి్సన ఆవశ్యకత దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జూడాలు గురువారం రాత్రి 9 గంటల నుంచి విధుల్లో చేరడంతో రెండ్రోజుల పాటు సాగిన సమ్మెకు తెరపడింది.

స్టైఫండ్‌ పెంచుతూ ఉత్తర్వులు
సీనియర్‌ రెసిడెంట్లకు ప్రస్తుతం నెలకు రూ.70వేల చొప్పున స్టైఫండ్‌ ఇస్తున్నారు. దీనిని 15 శాతం పెంచాలని ప్రభుత్వానికి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం నెలవారీ స్టైఫండ్‌ను రూ.80,500కు పెంచింది. ఈ మొత్తాన్ని 2021 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈÐ మేరకు వైద్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. ఇలావుండగా ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిపొ్లమా, ఎండీఎస్‌ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులకు సైతం ప్రభుత్వం స్టైఫండ్‌ను 15 శాతం పెంచింది. ఇందుకు సంబంధించి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపగా... ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు కూడా ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. 

స్టైఫండ్‌ పెంపు ఇలా...
కోర్సు                                 ప్రస్తుత స్టైఫండ్‌    పెంచిన తర్వాత
హౌస్‌ సర్జన్‌మెడికల్‌                        19,589            22,527
హౌస్‌సర్జన్‌డెంటల్‌                         19,589            22,527

పీజీ డిప్లొమాలో..
మొదటి సంవత్సరం                      44,075            50,686
రెండో సంవత్సరం                         46,524            53,503

సూపర్‌ స్పెషాలిటీలో..    
మొదటి సంవత్సరం                     48,973            56,319
రెండో సంవత్సరం                        51,422            59,135
మూడో సంవత్సరం                       53,869            61,949

పీజీ డిగ్రీ అండ్‌ ఎండీఎస్‌లో..
మొదటి సంవత్సరం                    44,075            50,686
రెండో సంవత్సరం                       46,524            53,503
మూడో సంవత్సరం                      48,973            56,319 

పెంపు జీవో విడుదల
     ఇంటర్నస్‌, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ పీజీ, సీనియర్‌ రెసిడెంట్ల (ఎస్‌ఆర్‌)కు స్టైపెండ్‌ 15% పెంపు. 2021 జనవరి నుంచి పెంపు వర్తింపు. స్టైపెండ్‌ పెంపు జీవో విడుదల

నిమ్స్‌లో పడకలకు ఓకే
     జూడాలు, వారి కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో పడకలు కేటాయించి వైద్యసేవలు అందించేందుకు అంగీకారం. 
ఇవి సీఎం దృష్టికి.. కీలకమైన ఎక్స్‌గ్రేషియా అంశంతో పాటు ఇన్సెంటివ్స్‌ (ప్రోత్సాహకాలు) అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టమైన హామీ.

మరిన్ని వార్తలు