Covid Effect: 19 వరకు సందర్శకులకు నో ఎంట్రీ 

16 Jun, 2021 12:09 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక ప్రదేశాల పునఃప్రారంభాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు ఈ నెల 16వ తేదీ నుంచి సందర్శకులను అనుమతించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో గత మార్చి నెలలో పర్యాటక ప్రదేశాలకు సందర్శకుల రాకను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో వీటిని తిరిగి సందర్శకుల కోసం తెరవాలని భావించింది. అయితే, మన రాష్ట్రంలో సాయంత్రం ఐదు గంటల వరకే లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఉన్నందున.. పర్యాటకులను అనుమతించాలా? వద్దా? అనే అంశంపై జిల్లా కలెక్టర్లతో చర్చించిన తర్వాతే ఈ నెల 19వ తేదీ అనంతరం నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ స్మితా ఎస్‌ కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో చార్‌మినార్, గోల్కొండ, వరంగల్‌ కోట ఉన్న సంగతి తెలిసిందే.   

చదవండి: విషాదం: ఆ పాప ఇక లేదు.. మీ విరాళాలు తిరిగిచ్చేస్తాం!

మరిన్ని వార్తలు