హెచ్‌సీయూ అప్పీల్‌పై సర్కారుకు నోటీసులు 

9 Jan, 2022 04:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమకు చట్టబద్ధమైన భూకేటాయింపులు లేవంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ) దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని మున్సిపల్‌ శాఖ కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్‌లను ఆదేశించింది. తమకు కేటాయించిన భూమిలోని 18.30 ఎకరాల్లో నిర్మిస్తున్న రహదారిని నిలిపివేయాలంటూ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి కొట్టేస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ భూమిపై వర్సిటీకి హక్కులు లేవని, హక్కుల కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు