కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టును నిలిపేయండి 

1 Jun, 2022 05:17 IST|Sakshi

కృష్ణా జలాల ఆధారంగా కర్నూలు జిల్లాలో కడుతున్న ప్రాజెక్టును ఆపండి 

కృష్ణా బోర్డుకు అభ్యంతరం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపూరంలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా జలాల ఆధారంగా పంప్డ్‌ స్టోరేజీ కాన్సెప్‌్టతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని సెక్షన్‌ 84, 85లకు విరుద్ధమని స్పష్టం చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతులు పొందాకే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది.

కేఆర్‌ఎంబీ/అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా చేపట్టిన అన్ని కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, కాల్వల విస్తరణ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలంటూ కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ ఇటీవల లేఖ రాశారు. నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్‌ నుంచి నీళ్లను వెలుపల ప్రాంతానికి తరలించి జల విద్యుదుత్పత్తికి వినియోగించడం తీవ్ర అభ్యంతకరమని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనులను నిలుపుదల చేయించాలని కోరుతూ గతంలో రెండుసార్లు లేఖ రాశామని గుర్తు చేశారు. ఈ నెల 17న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. గతంలో పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా కృష్ణా బోర్డు చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.  

గాలేరు–నగరికి అనుమతి ఉంది: ఏపీ అధికారులు 
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కాల్వ ద్వారా గోరకల్లు రిజర్వాయర్‌కు వచ్చే నీళ్లను మిగులు విద్యుత్‌ ఉండే సమయాల్లో మరో రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఇందుకోసం కొత్త రిజర్వాయర్‌ను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. విద్యుత్‌ కొరత ఉండే వేళల్లో ఈ కొత్త జలాశయం నుంచి నీళ్లను జలవిద్యుదుత్పత్తి ద్వారా దిగువన ఉండే గోరకల్లు రిజర్వాయర్‌కు మళ్లీ విడుదల చేస్తారు. కొత్త రిజర్వాయర్‌పై జలవిద్యుత్‌ కేంద్రం సైతం నిర్మిస్తున్నారు. పంప్డ్‌ స్టోరేజీ పద్ధతిలో విద్యుత్‌ను నిల్వ చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. వరద జలాల ఆధారంగా హంద్రీ నీవా సు జల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులున్న నేపథ్యం లో ఈ పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో ఎలక్రి్టక్‌ ప్రాజెక్టుపై అభ్యంతరాలకు తావు లేదని ఏపీ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.    
 

మరిన్ని వార్తలు