తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

7 Sep, 2020 13:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి జరిగే కేబినెట్‌ భేటీలో నూతన రెవెన్యూ చట్టానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక ముందు నుంచీ అనుకుంటున్నట్టుగా గ్రామ అధికారుల వ్యవస్థ రద్దు దిశగా కేసీఆర్‌ సర్కార్‌ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

  • కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
  • సాయంత్రం కేబినెట్‌లో ఆమోదం పొందనున్న కొత్త చట్టం
  • ఇక ముందు రిజిస్ట్రేషన్లు ఎలా ఉండాలో నిర్ణయించనున్న ప్రభుత్వం
  • రిజిస్ట్రేషన్లలో తహశీల్దార్‌ అధికారాలను సమీక్షించనున్న ప్రభుత్వం
  • వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను తహశీల్దార్‌లకు అప్పగించే యోచన
  • గృహ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను సబ్‌ రిజిస్ట్రార్‌లకు అప్పగించే యోచన
  • తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
  • కొన్ని కార్యాలయాలు తగ్గించి, మరికొన్ని చోట్ల కొత్తగా ఏర్పాటు చేసే యోచన
  • పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 20కి పైగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటు!
  • గ్రామీణ ప్రాంతాల్లో 20కి పైగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు తగ్గించే యోచన
  • ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే
  • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు లేని మండలాలు 443
  • తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు ఏర్పాట్లు
  • ధరణి వెబ్‌సైట్‌లో ఇక పూర్తి పారదర్శకంగా భూముల వివరాలు
  • అక్రమాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ల వ్యవస్థను తీర్చిదిద్దే యత్నం
  • వీఆర్‌వోల వద్ద రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం
  • రికార్డుల స్వాధీనం ఏ మేరకు వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు

కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు పాటించి సభ్యులంతా సమావేశాలకు హాజరయ్యారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, నెగటివ్‌ వచ్చినవారినే సభలోకి అనుమతించారు. సోమవారం నాటి సమావేశంలో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదలగు వారికి శాసన సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: వీఆర్‌వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!)

మరిన్ని వార్తలు