థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

31 Jul, 2021 21:20 IST|Sakshi

పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు

డెల్టా వేరియంట్ ప్రమాదకరం

ఇంటా బయటా మాస్క్‌ ధరించాలి

డీహెచ్ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర‌ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలని, నెల రోజుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ పెట్టుకొకపొతే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు.

దేశంలోని 50 శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయన్నారు. తెలంగాణలో డెల్టా ప్లస్‌కి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెండు డెల్టా ప్లస్‌ కేసులు హైదరాబాద్‌లోనే వచ్చాయన్నారు. డెల్టా వేరియంట్ ప్రమాదకరమని.. ఇంటా బయటా మాస్క్‌ ధరించాలని తెలిపారు. వచ్చే రెండు వారాలు రెండో డోస్‌కి ప్రాధాన్యత ఇస్తామని డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు