కరోనా కల్లోలం : తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం

15 Apr, 2021 16:37 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్లకు అదనంగా, మరో 25 శాతం పెంచాలని అధికారులను ఆదేశించింది. అలాగే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎలెక్టివ్‌ ఆపరేషన్లలను వాయిదా వేసుకోవాలని‌ సూచించింది. 

అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బెడ్స్‌ సంఖ్యని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ రోగులను ఆస్పత్రుల్లో చేర్చేందకు ప్రత్యేక ప్రొటోకాల్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలందరు మాస్క్‌ను విధిగా ధరిస్తూ, సామాజిక దూరంపాటించాలని.. దీనిపై ఏమాత్రం అశ్రధ్ధ చేయోద్దని  వైద్యారోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. 

చదవండి: కొంప ముంచిన అంత్యక్రియలు.. చనిపోయాక పాజిటీవ్‌.. దీంతో!

మరిన్ని వార్తలు