ఇంటర్నెట్ స్కూళ్ళు 9% లోపే..

28 Jul, 2021 02:10 IST|Sakshi

2,408 రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు

వర్చువల్‌ క్లాసులు తీసుకోలేకపోతున్న ఉపాధ్యాయులు 

అత్యధికంగా గుజరాత్‌లో 23,420 స్కూళ్లలో ఈ వసతి కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కాలంలో డిజిటల్‌ విద్య కీలకంగా మారింది. ఆన్‌లైన్‌లో చదువులు తప్పనిసరయ్యాయి. ఇందుకోసం ఇంటర్నెట్, వైఫై వంటి సౌకర్యం కీలకంగా మారింది. ఇళ్ల లోనూ, విద్యా సంస్థల్లోనూ ఇంటర్నెట్‌ లేకపోతే చదువు ముందుకు సాగే పరిస్థితి లేదు. కాగా, తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో 8.78% పాఠశాలల్లోనే ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండటం గమ నార్హం. మొత్తం 27,425 పాఠశాలలు ఉండగా, వాటిల్లో 2,408 స్కూళ్లకే ఇంటర్నెట్‌ వసతి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో వివిధ రాష్ట్రాలతో పోలిస్తే, ఇంటర్నెట్‌ ఉన్న స్కూళ్లలో తెలంగాణ 15వ స్థానంలో నిలి చిందని కేంద్రం తెలిపింది. దేశంలో అత్యధికంగా గుజరాత్‌లో 23,434 స్కూళ్లల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండగా, ఆ తర్వాత రాజస్తాన్‌లో 16,332 స్కూళ్లలో ఈ వసతి కల్పించారు. అత్యంత తక్కువగా లద్దాఖ్‌లో 17 స్కూళ్లకు ఇంటర్నెట్‌ సౌకర్యముంది.

చదువులో వెనుకబాటు...
దాదాపు అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటోంది. దీంతో ఆయా పాఠ శాలల్లో టీచర్లు నేరుగా విద్యార్థులతో వర్చువల్‌ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ, అనేక మంది విద్యార్థులు వాటిని చూడడం లేదు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమైన 9, 10 తర గతుల విద్యార్థులకు కూడా వర్చువల్‌ పద్ధతిలో క్లాసులు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్నెట్‌ ఉన్న కొన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో స్థానిక ఎంఈవోలు, ప్రధానో పాధ్యాయులు వర్చువల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకుంటున్నారు. దీనివల్ల విద్యార్థులు శ్రద్ధగా పాఠాలు వింటున్నా రని అధికారులు చెబుతున్నారు. అన్ని స్కూళ్లకు ఈ సౌకర్యం ఉంటే బాగుండని పేర్కొంటున్నారు.

బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించేలా..
కంప్యూటర్‌ విద్య అందించడానికి, డిజిటల్‌ ఇండి యాను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ బడులను బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలతో అనుసంధానించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేంద్రం ఆ నివేదికలో తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ద్వారా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మేరకు రాష్ట్రాలు కూడా కార్యాచరణ చేపట్టాలని కేంద్రం లేఖ రాసినట్లు తెలంగాణకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు