జీ–20 భారత్‌ వేడుకల్లో విద్యార్థులు

28 Dec, 2022 02:41 IST|Sakshi

వీసీలకు గవర్నర్‌ తమిళిసై సూచన  

సాక్షి, హైదరాబాద్‌: జీ–20కి భారత్‌ అధ్యక్షత వహించే అంశానికి సంబంధించిన వేడుకల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా చూడాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైఎస్‌ చాన్సలర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. ఇందుకు సంబంధించిన అనేక కార్యక్రమాలు విద్యార్థులతో నిర్వహించాలని సూచించారు. వీసీలతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, జీ–20 అధ్యక్ష సావనీర్‌ను తీసుకొచ్చేందుకు వివిధ పోటీలు నిర్వహించా లని కోరారు. ఇందులో మూడింటికి బహు మతి ఉంటుందని ప్రకటించారు. జి–20 వా రోత్సవాలు చేపట్టి, విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, క్విజ్, పెయింటింగ్, పోస్టర్‌ మేకింగ్‌ వంటి పోటీలు నిర్వహించాలని కోరార 

మరిన్ని వార్తలు