హైదరాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం 4,935 చదరపు గజాలు

12 May, 2022 04:18 IST|Sakshi

బంజారాహిల్స్‌లో టీఆర్‌ఎస్‌కు స్థలం

హైదరాబాద్‌ జిల్లా కార్యాలయం కోసం కేటాయించిన సర్కార్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్‌లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట మండలం/గ్రామం, ఎన్బీటీ నగర్‌ పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 వద్ద సర్వే నంబర్‌ 18/పీ, 21/పీలో ఈ స్థలం ఉంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ధరను ఖరారు చేసే ప్రక్రియను పెండింగ్‌లో ఉంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయం కోసం సదరు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ ఈ నెల 9న ప్రతిపాదనలు పంపగా 10న సీసీఎల్‌ఏ ఆమోదముద్ర వేసింది. స్థలం విలువ దాదాపు రూ.70 కోట్లు వరకు ఉంటుందని అంచనా.  

మరిన్ని వార్తలు