కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్లు

30 Jun, 2022 12:41 IST|Sakshi
కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబ సభ్యులతో కేసీఆర్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు సతీమణి బిక్కుమళ్ల సంతోషికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.

సంతోష్‌బాబు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన ‘మహావీర్‌ చక్ర’ పురస్కారానికి ఎంపికైనందున.. నిబంధనల మేరకు ఈ నగదును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బి.సంతోషికి ఈ నగదును అందజేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. (క్లిక్‌: దేవుడు అన్యాయం చేసినా.. సీఎం న్యాయం చేస్తున్నారు)

మరిన్ని వార్తలు