ఇక ఉదయమే బులెటిన్‌

27 Jul, 2020 04:09 IST|Sakshi

రాష్ట్రంలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్‌ కేసులు..

54,059కు చేరిన మొత్తం కేసులు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 బులెటిన్‌ను ప్రతి రోజు ఉదయం పూట ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. శనివారం రాత్రి ఇవ్వాల్సిన మీడియా బులెటిన్‌ను తాజాగా ఆదివారం ఉదయం విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 1,593 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కు చేరింది. 41,332 మంది కోలుకోగా,  12,264 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. శనివారం మరో 8 మంది కోవిడ్‌–19తో మరణించడంతో మొత్తం మరణాలు 463కు పెరిగాయి. శనివారం రాష్ట్రంలో 15,654 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య 3,53,425. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 391 పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ఆసిఫాబాద్‌ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో  జీహెచ్‌ఎంసీ పరిధిలో 641, రంగారెడ్డిలో 171, వరంగల్‌ అర్బన్‌లో 131, మేడ్చల్‌లో 91, సంగారెడ్డిలో 61, కరీంనగర్‌లో 51, నాగర్‌కర్నూల్‌లో 46, మహబూబ్‌నగర్‌లో 38, కామారెడ్డిలో 36, నిజామాబాద్‌లో 32, మహబూబాబాద్‌లో 29, మంచిర్యాల, సిరిసిల్లలో 27 చొప్పున, సూర్యాపేట్‌లో 22, వరంగల్‌ రూరల్, మెదక్, జనగామ జిల్లాల్లో 21 చొప్పున, ఖమ్మంలో 18, కొత్తగూడెంలో 17, పెద్దపల్లిలో 16, ఆదిలాబాద్‌లో 14, ములుగులో 12, భువనగిరిలో 11, వికారాబాద్‌లో 9, నారాయణపేట్‌లో 7, నల్గొండలో 6, సిద్దిపేట్, గద్వాలలో 5 చొప్పున, భూపాలపల్లిలో 3 కేసులు నమోదయ్యాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా