Telangana: నేటి నుంచి ‘రైతుబంధు’

28 Jun, 2022 02:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ వానాకాలం సీజన్‌లో 68.10 లక్షలమంది రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందడానికి అర్హులని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మంగళవారం(నేడు) నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మొదటిరోజు ఎకరా వరకు భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు 586.65 కోట్లు జమ చేస్తామని పేర్కొంది. 1,50,43,606 ఎకరాలకు చెందిన రైతులకు రైతుబంధు సొమ్ము అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అందుకోసం రూ.7,521.80 కోట్లు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

మరిన్ని వార్తలు