Dalita Bandhu: దళితబంధులో మొత్తం 30 పథకాలు.. జాబితా ఇదే

11 Aug, 2021 01:15 IST|Sakshi

మొత్తం 30 పథకాలు ఖరారు చేసిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దళితబంధు కింద లబ్ధిదారులకు ఉపయోగపడే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దళితులకు స్వయం ఉపాధి కల్పన కోసం మొత్తం 30 రకాల పథకాలు/కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్‌ నుంచి మినీ సూపర్‌ బజార్‌ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో చేర్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారిని దృష్టిలో పెట్టుకుని వీటిని ఎంపిక చేసింది.

దళితుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ పథకం కింద ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు.. ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ఈ పథకం అమలుపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు