బతుకమ్మ కానుకగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌

14 Aug, 2022 04:39 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

రాష్ట్రంలో 9 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు శ్రీకారం

మందుల నిర్వహణకు ఈ–ఔషధీ, పరికరాల నిర్వహణకు ఈ–ఉపకరణ్‌ పోర్టల్‌

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గర్భిణుల్లో పౌష్టికలోపాల్ని తగ్గించి ఆరోగ్యవ ంతమైన బిడ్డకు జన్మనిచ్చేందుకు కొత్తగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ను అందుబాటులో కి తీసుకొస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. దసరా పండుగను పురస్కరించుకు ని బతుకమ్మ కానుకగా ఈ కిట్‌లను లబ్ధిదా రులకు అందిస్తున్నట్లు తెలిపారు.

శనివారం కోఠిలోని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రో గ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్తహీనత అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కా మారెడ్డి, కుమ్రుంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌ కర్నూల్, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామన్నా రు. తొలుత 1.5లక్షల మందికి ఈ కిట్‌లు అందజేస్తామని, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.

ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు కిట్‌లు..
ఒక్కో కిట్‌ ధర రూ.2వేల వరకు ఉంటుందని, ఇందులో నెయ్యి, ఖజూర్, హార్లిక్స్‌ తదితర పౌష్టిక పదార్థాలుంటాయని మంత్రి హరీశ్‌ తెలిపారు. ఒక్కో లబ్ధిదారుకు రెండుసార్లు ఈ కిట్‌లు ఇస్తామని, గర్భం దాల్చిన మూడు నెలలకోసారి, ఆర్నెల్లకోసారి ఈ కిట్‌ లబ్ధిదారుకు అందుతుందన్నారు. ప్రభుత్వా స్పత్రుల్లో మందులను మూడు నెలల ముందస్తు కోటాగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు.

ఇందులోభాగంగా ఈ–ఔషధీ, వైద్య పరిక రాల నిర్వహణకు ఈ–ఉపకరణ్‌ పోర్టళ్లను మంత్రి ఆవిష్కరించారు. మందుల కొనుగో లుకు సీఎం కేసీఆర్‌ రూ.500 కోట్ల బడ్జెట్‌ కేటాయించారని, ఇందులో రూ.100 కోట్లను ఆస్పత్రుల సూపరింటెండెంట్ల దగ్గర అందుబాటులో ఉంచామని వివరించారు.

మరిన్ని వార్తలు