తెలంగాణలో తగ్గిన కరోనా పరీక్షల ధరలు

22 Dec, 2020 20:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పరీక్షల ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ఆర్టీపీసీఆర్ టెస్టు ధర రూ.850 నుంచి రూ.500కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి వద్ద శాంపిల్‌ పరీక్ష ధర రూ.1200 నుంచి రూ.700కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకే ధరలు తగ్గించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. (చదవండి: కొత్త కరోనా: తెలంగాణ సర్కార్‌ అలర్ట్)‌

ఇది ఇలా ఉండగా, బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో తెలంగాణ అప్రమత్తమైంది. యూకే ప్రయాణికులను ట్రాక్ చేస్తున్నామని, వారం రోజుల్లో యూకే నుంచి 358 మంది వచ్చినట్టు గుర్తించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ వెల్లడించారు. స్ట్రెయిన్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌ వచ్చాక ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.(చదవండి: భారత్‌లో కొత్త రకం కరోనా ఎంట్రీ!)

మరిన్ని వార్తలు