Telangana: ప్రభుత్వ భూముల అమ్మకాలకు మార్గదర్శకాలు ఖరారు!

10 Jun, 2021 19:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా ప్రభుత్వ భూముల విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటుకానుంది. 

భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్‌ కమిటీ పనిచేస్తుందని తెలిపింది. భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకాల పర్యవేక్షణ కోసం ఆక్షన్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. 

మరిన్ని వార్తలు