‘దళిత బంధు’ పథకానికి రూ.250 కోట్లు విడుదల

18 Oct, 2021 21:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ ఆదేశాలతో ‘దళిత బంధు’ పథకానికి రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిధుల విడుదల ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మ జిల్లా చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూలు జిల్లా చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలానికి రూ.50 కోట్లు విడుదల చేశారు. (చదవండి: Dalit Bandhu: హుజురాబాద్‌లో దళిత బంధుకు బ్రేక్‌

కాగా, ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యధావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.
చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌! 

మరిన్ని వార్తలు