నేటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ 

8 Sep, 2021 03:11 IST|Sakshi

సిద్దిపేటలో ప్రారంభించనున్న మంత్రులు తలసాని, హరీశ్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. సిద్దిపేట జిల్లా చందలాపూర్‌లోని రంగనాయకసాగర్‌లో, సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలిసి చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని నీటి వనరులలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులు.. చేప పి ల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరా రు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 30 వేల నీటి వనరులలో రూ. 80 కోట్ల ఖర్చుతో 93 కోట్ల చేప పిల్లలను, 200 వివిధ నీటి వనరులలో రూ. 25 కోట్ల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

మరిన్ని వార్తలు