తెలంగాణలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌ల బదిలీ

13 Feb, 2024 03:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

► నిజామాబాద్‌ అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రాను ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్‌ను నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు.

► ఆదిలాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తాను ఉట్నూరు ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చేతన్‌ బాజ్‌పాయ్‌ను తదుపరి పోస్టింగ్‌కు సాధారణ పరిపాలన శాఖను రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

రాచకొండ సీపీగా తరుణ్‌జోషీ 
రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ సీపీగా మల్టీజోన్‌–2 ఐజీగా ఉన్న డా.తరుణ్‌జోషి నియమితులయ్యారు.రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుదీర్‌బాబును మల్టీజోన్‌ –2 ఐజీగా నియమించారు. మల్టీజోన్‌–1 ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు