TS IAS Officers Transfer: పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు

24 Jan, 2024 20:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది.

  • పశుసంవర్థకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్‌
  • ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌. శ్రీధర్‌
  • టీఎస్‌ ఐఆర్‌డీ సీఈవోగా కాత్యాయని దేవి
  • గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్‌
  • రోడ్లు భవనాల  శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌
  • వైధ్య ఆరోగ్య శాఖ సయుక్త కార్యదర్శిగా టి. వినయ్‌ కృష్ణా రెడ్డి

whatsapp channel

మరిన్ని వార్తలు