కేంద్ర ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?: హరీశ్‌

26 Apr, 2022 02:41 IST|Sakshi
గ్రంథాలయంలో నిరుద్యోగులకు భోజనం  వడ్డిస్తున్న మంత్రి హరీశ్‌రావు  

సాక్షి, సిద్దిపేట: కేంద్రంలో ఖాళీగా ఉన్న 15.65 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌ చెప్పా లని ఆర్థిక, వైద్యా రోగ్య మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ‘సంజయ్‌ యాత్ర చేస్తూ రోజూ సీఎం కేసీఆర్‌ను తిడితే ఏం వస్తుంది? కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయిస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు దక్కుతాయి కదా’ అని హితవు పలికారు.

సిద్దిపేటలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్‌ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులపై విమర్శలు చేశారు. రైల్వే శాఖలో ఉదోగ్యాలు ఖాళీ అవుతుంటే భర్తీ చేయకుండా, రైల్వేలైన్, రైల్వే స్టేషన్‌లను అమ్ముతున్నారని ఆరోపించారు. తెలంగాణలోని బీజేపీ నాయకులకు దమ్ముంటే కొత్త జిల్లాలకు రావాల్సిన నవో దయ స్కూళ్లను తీసుకురావాలని సవాల్‌ విసి రారు.త్వరలో 500 గ్రూప్‌–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ రానుందని, ఇది చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. గ్రూప్‌–1లో 95 శాతం స్థానికులకు, 5 శాతం ఇతరులకు ఉద్యోగాలు దక్కనున్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు